Thursday, June 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి

ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

ప్రభుత్వ పాఠశాలలను ప్రజాప్రతినిధులు సందర్శించాలి.
పిడిఎస్ యు మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి ఇరుగు స్టాలిన్
నవతెలంగాణ-నెల్లికుదురు

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో  ప్రజాప్రతినిధులు సందర్శించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పి డి. ఎస్ యు మహబూబాద్ జిల్లా సహాయ కార్యదర్శి ఇరుగు స్టాలిన్ డిమాండ్ చేసినట్లు తెలిపారు. గురువారం మండల కేంద్రంలో మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేతను విరమించుకోవాలి హాయ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి  గురుకుల సమస్యలు పరిష్కరించాలి మెరుగైన హాస్టల్ వసతులు సౌకర్యాలు కల్పించాలి గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాలి , పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను విడుదల చేయాలి , ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి అని వారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బ్రేక్ ఫాస్ట్  & మిల్క్ పథకాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలి.

ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్స్ నిర్మించాలి.  నూతన  క్లాస్ రూమ్ లను ఏర్పాటు చేయాలీ. సకాలంలో విద్యార్థులకు యూనిఫామ్స్  ఇవ్వాలి.ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలి..ప్రభుత్వం వెంటనే స్పందించి పై అన్ని తక్షణమే అమలు చెయ్యాలి , లేనియెడల, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో మనోజ్  రాజు  లెనిన్ మనోజ్ స్రవంతి వసుంధర లహరి విష్ణువర్ధన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -