- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్
నీటి సమస్య తలెత్తకుండా చూస్తామని, మున్సిపల్ చైర్ పర్సన్ బిజన బలమని భాస్కర్ అన్నారు. ఆలేరు పట్టణంలో బీసీ కాలనీ వద్ద అవసరాలకు సరిపడా నీరు రావడంలేదని మున్సిపల్ చైర్ పర్సన్ దృష్టికి కాలనీవాసులు తీసుకెళ్లాగా, తక్షణమే స్పందించి బోర్ మోటార్ ఏర్పాటు చేశారు. బీసీ కాలనీ లోని ప్రైమరీ స్కూల్ వద్ద ఉన్న ఖాళీ బోరింగ్ లో కొత్త మోటర్ ఏర్పాటు చేయించి నీటి పంపింగ్ ప్రారంభించారు. తద్వారా బీసీ కాలని నీటి సమస్యను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధేశ్వర్, సురేందర్, పట్టణ నాయకులు జెట్టసిద్దులు, వస్పరి వీరసాగర్, వడ్డెమన్ నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



