Friday, June 19, 2026
E-PAPER
Homeఆటలుహెచ్‌‌పిఎస్‌‌కు ఫుట్‌‌బాల్‌ ట్రోఫీ

హెచ్‌‌పిఎస్‌‌కు ఫుట్‌‌బాల్‌ ట్రోఫీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : సిఐఎస్‌‌సీఈ సుబ్రతో కప్‌ ‌ఫుట్‌‌బాల్‌ ‌టోర్నమెంట్‌ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌) అండర్‌-17 ‌బాయ్స్‌ ‌టైటిల్‌‌ను హైదరాబాద్‌ ‌పబ్లిక్‌ ‌స్కూల్‌ (‌హెచ్‌‌పిఎస్‌) ‌బేగంపేట్‌ ‌సొంతం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో సెయింట్‌ ‌ప్యాట్రిక్‌ ‌హైస్కూల్‌పై 4-0తో హెచ్‌‌పిఎస్‌ ‌గెలుపొందింది. హెచ్‌‌పిఎస్‌ ‌తరఫున దన్యాల్‌, అభిరామ్‌ ‌చెరో గోల్‌ ‌కొట్టగా.. అబ్దుల్‌ ‌కలాం రెండు గోల్స్‌ ‌సాధించాడు. అంతకుముందు సెమీఫైనల్లో ఎన్‌ఏఎస్‌ఆర్‌ ‌స్కూల్‌‌పై హెచ్‌‌పిఎస్‌ 1-0తో గెలుపొందింది. విజేతగా నిలిచిన హెచ్‌‌పిఎస్‌ ‌జట్టును ఎన్‌ఏఎస్‌ఆర్‌ ‌ప్రిన్సిపాల్‌ ‌హఫీజుద్దీన్‌ అహ్మద్‌ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -