- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం మల్లారం గ్రామపరిధిలోని దుబ్బపేటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ మేకల రాజయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. తేమ 17 శాతం మించకుండా పాక్యూ వచ్చిన తరువాత టోకెన్ తీసుకొని విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆవిర్నేని పురుషోత్తం రావు, వార్డు సభ్యుడు భోగే సదానందం, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు,హమాలి కార్మికులు పాల్గొన్నారు.
- Advertisement -



