Friday, June 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసన్న వడ్ల బోనస్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం..

సన్న వడ్ల బోనస్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వరి పండించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీ మేరకు సన్న వడ్లకు ప్రకటించిన రూ.500 బోనస్‌ను ఇకపై అధికారికంగా గుర్తించిన ఏడు రకాల సన్న వడ్లకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది. బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్‌ఎన్‌ఆర్‌-15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్‌, కేఎన్‌ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్‌-44 (సిద్ది), కేఎన్‌ఎం-7715 రకాల విత్తనాలను బోనస్‌ చెల్లింపునకు అర్హమైనవిగా సర్కారు విడుదల చేసిన జాబితాలో చేర్చింది. సాగు మార్కెట్‌ అవసరాలు, దేశ విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను శాస్ర్తీయంగా విశ్లేషించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -