Monday, May 4, 2026
E-PAPER
Homeసినిమాగోపీచంద్‌ నయా సినిమా షురూ

గోపీచంద్‌ నయా సినిమా షురూ

- Advertisement -

హీరో గోపీచంద్‌ నటించనున్న తన 34వ సినిమా ఆదివారం ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా ఫైట్‌ మాస్టర్‌ వి వెంకట్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 70 ఎఎ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై విజరు చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ నటి అనార్కలి నజర్‌ను ఎంపిక చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా ఆమె తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఆదివారం పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు పలువురు ప్రత్యేక అతిథులు కూఆ హాజరయ్యారు. దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత దామోదర్‌ ప్రసాద్‌, మైత్రి మూవీ మేకర్స్‌ రవి శంకర్‌ స్క్రిప్ట్‌ను అందజేశారు. యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్స్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, మల్లెమాల శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి ఫస్ట్‌ క్లాప్‌ కొట్టారు. నిర్మాత దిల్‌ రాజు ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.
అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక నైపుణ్యంతో కూడిన ఒక సరికొత్త కథాంశాన్ని 70 ఎఎ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రేక్షకులకు అందించనుంది. దర్శకుడిగా తన తొలి చిత్రంతో వి.వెంకట్‌ ఒక పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌ను రూపొందించారు. గోపీచంద్‌ను పూర్తి యాక్షన్‌ అవతార్‌లో, ఇంటెన్స్‌ డ్రామా, ఎమోషన్స్‌ కూడిన పాత్రలో ప్రజెంట్‌ చేయనున్నారు. గోపీచంద్‌, అనార్కలి నజర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: వి వెంకట్‌, నిర్మాతలు: విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి, డీఓపీ : షామ్‌దత్‌, సంగీతం: సామ్‌, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: రామకృష్ణ-మోనిక.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -