మలయాళ ఫిల్మ్ మేకర్స్ తెలుగు స్టార్లతో కలిసి పని చేయటం విశేషం. మమ్ముట్టి నటించిన ‘స్ట్రీట్ లైట్స్’కి దర్శకత్వం వహించిన సినిమాటో గ్రాఫర్ షామ్‌దత్, ‘చౌర్య పాఠం’లో ఆకట్టుకున్న ఇంద్ర రామ్ హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్ ‘డోంట్ స్లీప్’ సినిమా చేస్తున్నారు. వి.చూడామణి ఈ చిత్రాన్ని వి డ్రీమ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 2గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రివీల్ చేసిన టైటిల్, ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రవీంద్ర విజరు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రవీంద్ర విజరు బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో రవీంద్ర విజరు స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఇంటెన్స్ వైబ్‌తో ఉన్న ఈ ఫస్ట్ లుక్ ఆయన పాత్రలో ఉన్న సస్పెన్స్, థ్రిల్ ఎలిమెంట్స్ ప్రజెంట్ చేస్తోంది. ఎమోషనల్, టెక్నికల్‌గా ఈ చిత్రం గొప్ప సైకాలజికల్ థ్రిల్లర్ అనుభూతిని ప్రేక్షకులకు అందించబోతుంది అని మేకర్స్ తెలిపారు. రవీంద్ర విజరు, తబా రీమా, జ్యోతి బెనర్జీ, సునీల్ థాపా, ఆడుకలం నరేన్, కల్ప లత, అనీష్ కురువిల్లా, వెన్నెల కిషోర్, నాగి జబర్దస్త్, డాక్టర్ భద్రమ్, రఘుబాబు, తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి డైరెక్టర్, డీఓపీ : షామ్‌దత్, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: సజీర్ బాబా, లూనా జబిన్, నిర్మాత: వి. చూడామణి, సంగీతం: గోకుల్ హర్షన్, ప్రొడక్షన్ డిజైన్: మోనికా రామకృష్ణ.



