నవతెలంగాణ – హైదరాబాద్ : సుప్రీంకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ తగిలింది. రామోజీరావు మరణించిన నేపథ్యంలో కేసును కొనసాగించవద్దని మార్గదర్శి తరపు న్యాయవాది వాదనలు వినిపించగా, రామోజీ ఆస్తులను అటాచ్ చేసి బాధితులకు పంచుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటికే అందరికీ చెల్లింపులు చేశామని న్యాయవాది చెప్పగా, ఆ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని మార్గదర్శికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను మార్గదర్శి సేకరించిందని, ఈ నేపథ్యంలో రామోజీరావు మరణంతో కేసు మెయింటైనబుల్ కాదని హైకోర్టులో మార్గదర్శి వాదించింది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీంకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



