నవతెలంగాణ-హైదరాబాద్: నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలితం పుదుచ్చేరిలో ఎన్నికల కౌంటింగ్ ముమ్మరంగా సాగుతోంది. తమిళనాడులో టీవీకే భారీ మోజార్టీలో ఉండగా, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ, కేరళ యూడీఎఫ్, బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీల మధ్య ఉత్కంఠ పోటీ నెలకొంది. మరో వైపు సీఎం ఎవరూ అనే అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది. ఐదు రాష్ట్రాల్లో ఆయా నాయకుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి.
234 అసెంబ్లీ స్థానాలకు టీవీకే అధినేత విజయ్ స్పష్టమైన మోజార్జీతో ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. టీవీకే 105తో ముందంజలో ఉండగా, అన్నాడీఎంకే 65, డీఎంకే 62 రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. దీంతో సీఎంగా విజయ్ తొలిసారిగా అధికారం చేపట్టనున్నారు.
కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.140 స్థానాలకు 98 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఎల్‌డీఎఫ్ 40, బీజేపీ సింగిల్ డిజిట్ సీటుకు పరిమితమైంది. దీంతో శశిథరూర్ పేరు సీఎంగా మారుమోగుతుంది.
అసోం, పుదుచ్చేరిలో బీజేపీ హవా నడుస్తోంది. 126 స్థానాలకు బీజేపీ 98, కాంగ్రెస్ 26 వెనకంజలో ఉంది. పుదుచ్చేరి ఇదివరకు రంగాస్వామి సీఎంగా ఉన్నారు. అదే విధంగా అసోంలో హిమంత్ బిస్వా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అయితే ముఖ్యమంత్రి స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండనున్నాయని ఆయా పార్టీల శ్రేణులలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
బెంగాల్‌లో ఎన్డీయే కూటమిలో ముందు వరుసలో ఉంది. 294 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ 191 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, టీఎంసీ రెండో స్థానంలో కొనసాగుతుంది. ఎన్డేయే అభ్యర్థిగా సువేంద అధికారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.



