నవతెలంగాణ-హైదరాబాద్: సోమవారం ఎన్నికల కౌంటింగ్ వేళ బెంగాల్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి ఎన్నికల ర్యాలీలు, విక్టరీ ర్యాలీలు, రోడ్ షోలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించకూడదని ప్రకటించారు. ఆయా రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు సహకరించాలని కోరారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ రోజంతా కొనసాగే అవకాశం ఉందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలగకూడదని, కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి అంతరాయాలు కలగకుండా నిరోధించడమే తమ లక్ష్యమని పోలీసులు తెలిపారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఎన్డేయో కూటమి ముందంజలో కొనసాగుతోంది. రెండో స్థానంలో టీఎంసీ కొనసాగుతోంది. అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సీట్ల సంఖ్యను బీజేపీ ఆందుకోనుంది.
బెంగాల్‌లో విక్టరీ ర్యాలీలు నిషేధం
- Advertisement -
- Advertisement -



