Monday, May 4, 2026
E-PAPER
Homeజాతీయంమ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..

మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలకు కీలక సందేశం ఇచ్చారు. ఓటమిని అంగీకరించకుండా, చివరి వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఒక వీడియో సందేశంలో దీదీ మాట్లాడుతూ… పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఎవరూ కౌంటింగ్ కేంద్రాలను విడిచి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. “ఇది బీజేపీ పన్నిన కుట్ర. మొదటి రెండు మూడు రౌండ్లలో వారి ఫలితాలు ముందుగా, మనవి తర్వాత చూపిస్తారని నేను నిన్నటి నుంచే చెబుతున్నాను. సుమారు 100 చోట్ల రెండు, మూడు రౌండ్ల తర్వాత కౌంటింగ్ ఆపేశారు. కళ్యాణిలో 7 ఈవీఎంలలో తేడాలు కనిపించాయి” అని ఆమె ఆరోపించారు.

కేంద్ర బలగాలను ఉపయోగించి బీజేపీ తమ పార్టీపై దౌర్జన్యానికి పాల్పడుతోందని మమత తీవ్ర విమర్శలు చేశారు. “కేంద్ర బలగాలను అడ్డుపెట్టుకుని టీఎంసీ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు, బలవంతంగా ఆక్రమించుకుంటున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ఓట్లు కొల్లగొట్టి సీట్లు గెలవాలని చూశారు. అయినప్పటికీ మేము 70-100 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాం. కానీ, ఆ వార్తలను బయటకు రానీయడం లేదు. పూర్తిగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు” అని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -