Monday, May 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవతెలంగాణ ఎఫెక్ట్..స్పందించిన అధికారులు

నవతెలంగాణ ఎఫెక్ట్..స్పందించిన అధికారులు

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో ప్రమాదకరంగా వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ లైన్ సమస్యపై నవతెలంగాణలో వచ్చిన వార్తకు అధికారులు స్పందించారు. గ్రామ ప్రవేశ ద్వారం వద్ద తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్ కారణంగా వడ్ల లారీలు,రైతుల గడ్డి తగులుతూ ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రచురితమైన వార్తపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించి పరిశీలన చేపట్టారు. తక్షణమే చర్యలు తీసుకుని, అదనపు విద్యుత్ పోల్ ఏర్పాటు చేసి లైన్‌ను సురక్షిత ఎత్తుకు ఎత్తే పనులను ప్రారంభించారు. దీంతో గ్రామ ప్రజలు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నవతెలంగాణకు, స్పందించి సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చిన అధికారులకు గ్రామ సర్పంచ్ పరిదే మమత మరియు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -