నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ఏడు క్లస్టర్ల పరిధి రైతు వేదికలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా నాగుల్గావ్, పెద్ద ఏడ్గి , పెద్ద గుల్ల, హంగర్గ, ఖండేబల్లూర్, డోన్ గావ్, జుక్కల్ మండలాల రైతులకు ఎంఈవో సతీష్ కుమార్ కీలక విషయాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ జాదవ్ సునంద, ఉప సర్పంచ్, రైతులు, పెద్దలు జాదవ్ విజయ్ పాటీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. సమగ్ర పరిరక్షణ, సమగ్ర ఎరువుల యాజమాన్యం, మట్టి నమూనా సేకరణ, మట్టి నమూనా సేకరించే విధానంపైన డిమాంస్ట్రేషన్, ఫార్మేర్ రిజిస్ట్రీ, నిగ్రాని సమితి ,వేసవి దుక్కులు వాటి ప్రాముఖ్యత, వానాకాలం సాగు కు అనువైన వరి వంగడాలు మొదలగు అన్ని విషయాల మీద రైతు సోదరులకు సవివరంగా వెల్లడించారు.
రైతులు నేల ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలని, రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించాలని సూచించారు. రసాయనిక ఎరువులతో పాటు జీవన ఎరువులు అయిన అజటో బాస్టర్, సూడో మోనాస్, ఫాస్ఫరస్ సలబులైజింగ్ బ్యాక్టీరియా వాడడం వల్ల రసాయనిక ఎరువుల వాడకం ను తగ్గించి నేల ఆరోగ్యం కాపుడుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా పర్యావరణ కాలుష్యం తగ్గించొచ్చని అన్నారు. ఎరువుల యాజమాన్యం, బ్లాక్ మార్కెట్ అవ్వకుండా గ్రామ స్థాయిలో నిగ్రాని సమితి ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, వేసవిలో లోతైన దుక్కులు దున్నుకోవడం ద్వారా నీరు ఇంకే సామర్థ్యం పెరుగును, నేల గుల్లగా అవును, హానికర పురుగుల యొక్క ప్యూపా దశలు పైకి వచ్చి ఎండకు నశించడం వల్ల పురుగు మందుల వాడకం తగ్గించవచ్చని చెప్పారు. అదేవిధంగా మట్టి పరీక్ష ఆధారంగా ఎరువుల వాడడం వల్ల కూడా నేల ఆరోగ్యాన్ని కాపాడొచ్చని తెలిపారు. మట్టి శాంపిల్ తీసుకునే విధానం మీద ప్రకాష్ స్వామి చేనులో డిమాంస్ట్రేషన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సునంద విజయ్ పటేల్, ఉప సర్పంచ్ అమృత్ గోండ, మాజీ సర్పంచ్ అనిల్, మాజీ ఎంపిటీసి సభ్యులు అశోక్ పటేల్, కేశవ్ పటేల్, సంతోష్, వీరేశం, ప్రకాష్ స్వామి, రాగోబ శ్రీనివాస్, క్లస్టర్ లో ఉన్న నాలుగు గ్రామాల రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు.



