Monday, May 4, 2026
E-PAPER
Homeజాతీయంతమిళనాడులో విజయ్ గెలుపును ముందే చెప్పాం: యాక్సిస్ మై ఇండియా

తమిళనాడులో విజయ్ గెలుపును ముందే చెప్పాం: యాక్సిస్ మై ఇండియా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే గెలుస్తుందని తాము ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేసినప్పుడు, దేశంలోని రాజకీయ పండితులు, విశ్లేషకులు, ఇతర పోలింగ్ ఏజెన్సీల వాళ్లు తమను చూసి నవ్వారని యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్ ప్రదీప్ గుప్తా అన్నారు. నేడు వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో టీవీకే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న నేపథ్యంలో ఆయన ఎన్డీటీవీతో మాట్లాడారు.

తొలిసారి ఎన్నికల బరిలో దిగిన విజయ్ పార్టీకి 234 స్థానాల అసెంబ్లీలో 98 నుంచి 120 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్‌లో యాక్సిస్ మై ఇండియా మాత్రమే అంచనా వేసింది. తాజా ఫలితాల సరళి ప్రకారం టీవీకే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ సంచలనం సృష్టిస్తోంది. “ఇది డేటా సైన్స్ సాధించిన విజయం. ఇతర సంస్థలు క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోలేకపోయాయి. మేము మాత్రం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి సర్వే చేశాం. అందుకే మా అంచనాలు నిజమయ్యాయి” అని ప్రదీప్ గుప్తా వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -