Sunday, July 5, 2026
E-PAPER
Homeజాతీయంయువత వీధుల్లోకి రాకుండా ఈ దేశాన్ని కాపాడలేం

యువత వీధుల్లోకి రాకుండా ఈ దేశాన్ని కాపాడలేం

- Advertisement -

బాధ్య‌తారాహిత్యంగా వ్యవహరిస్తోన్న కేంద్ర ప్ర‌భుత్వం : సీపీఐ(ఎం) రాజ్య‌సభా 
ప‌క్ష‌నేత‌ జాన్ బ్రిట్టాస్‌
సీజేపీ ఆందోళ‌న, సోనమ్‌‌ దీక్ష‍కు సీపీఐ(ఎం), ఆప్, డీఎంకే నేత‌ల సంఘీభావం
ప్రధాని మోడీకి 
అభిజీత్ దీప్కే లేఖ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

​ యువత వీధుల్లోకి రాకుండా ఈ దేశాన్ని కాపాడలేమని సీపీఐ(ఎం) రాజ్య‌స‌భ ప‌క్ష‌నేత జాన్ బ్రిట్టాస్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యతారహితంగా, సున్నితత్వం లేకుండా వ్యవహరిస్తోందని విమ‌ర్శించారు. దేశంలోని విద్యా వ్య‌వ‌స్థ‌లోని వైఫ‌ల్యాల‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఏడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు, అలాగే కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) ఆధ్వ‌ర్యంలో 15 రోజులుగా కొన‌సాగుతున్న ఆందోళ‌న‌కు జాన్ బ్రిట్టాస్ సంఘీభావం తెలిపారు. ఆయ‌న‌తో పాటు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, డీఎంకే నాయకుడు, తమిళనాడు మాజీ మంత్రి టి. మనో తంకరాజ్ సంఘీభావం తెలిపారు. సీజేపీ ఆందోళనకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తమ మద్దతును ప్రకటించింది. అంతేకాక ఎస్కేఎం ప్రతినిధి బృందం ఆదివారం జంతర్ మంతర్‌కు వెళ్లనుంది. వీరి ఆందోళనలను కేంద్రం విస్మరించడాన్ని వ్యతిరేకిస్తూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రధానమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ, ఏఐఎస్ఎఫ్ వంటి సంఘాలు కూడా ఈ నిరసనలో ముందు వరుసలో ఉన్నాయి.మరోపక్క ​వాంగ్‌చుక్‌తో కలిసి నిరాహార దీక్ష చేస్తున్న కొందరు విద్యార్థులను ఆస్పత్రికి తరలించారుపారదర్శకమైన పరీక్షా విధానం కోసం యువత పోరాటం యువత ప్రత్యేక హక్కులను కోరడం లేదనీ, పారదర్శకమైన పరీక్ష‍ా విధానం కోసం మాత్రమే పోరాడుతోందని సీపీఐ(ఎం) రాజ్య‌స‌భ ప‌క్ష‌నేత జాన్ బ్రిట్టాస్ అన్నారు. వీరి ఆందోళ‌న‌ను స్వాగతిస్తూ ఆయన ఈ విధంగా మాట్లాడారు. ‘‘ఈ రోజు నేను ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా మాత్రమే ఇక్కడికి రాలేదు. దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలకు సంఘీభావం తెలిపే భారత పౌరుడిగా మీ ముందుకు వచ్చాను. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంది. రాజ్యాంగం మనకు కల్పించిన ఈ హక్కును గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత. శాంతియుతంగా తమ సమస్యలను తెలియజేస్తున్న విద్యార్థులను, నిరుద్యోగులను, యువత గొంతు వినడం ప్రభుత్వ బాధ్యత’’ అని అన్నారు. ‘‘యువత కోరేది ప్రత్యేక హక్కులు కాదు. వారు కోరేది పారదర్శకమైన పరీక్షా విధానం, సమయానికి నియామకాలు, ప్రతిభకు తగిన గుర్తింపు, సమాన అవకాశాలు మాత్రమే. ఇవి ప్రజాస్వామ్య దేశంలో ప్రతి యువకుడి హక్కులు. ఈ ఆందోళనను కేవలం ఒక రాజకీయ కార్యక్రమంగా చూడకూడదు. ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యా వ్యవస్థలో పారదర్శకత పెంచాలి. పరీక్షల నిర్వహణలో నమ్మకాన్ని పునరుద్ధరించాలి’’ అని డిమాండ్ చేశారు.

ఇంకెంతకాలం విస్మ‌రిస్తారు?: 
ప్ర‌ధాని మోడీకి సీజేపీ లేఖ
సీజేపీ ఆందోళ‌న‌పై ప్రధాని నరేంద్ర మోడీ తన ‘గాఢ మౌనాన్ని’ వీడాలనీ, పరీక్ష పత్రాల లీకేజీ, విద్యార్థుల ఆత్మహత్యల ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను జవాబుదారీగా చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -