Sunday, July 5, 2026
E-PAPER
Homeఆటలుముగిసిన కాబో బెర్డే పోరాటం

ముగిసిన కాబో బెర్డే పోరాటం

- Advertisement -

ప్రీ క్వార్టర్స్‌‌కు అర్జెంటీనా మెస్సీ మరో గోల్‌

మియామీ: ఫిఫా ప్రపంచకప్‌లో కాబో వెర్డే పోరాటం ముగిసింది. తొలిసారిగా విశ్వకప్‌కు అర్హత సాధించిన చిన్ని దేశం కాబో వెర్డే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఏకంగా నాకౌట్‌కు చేరింది. శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ అర్జెంటీనాతో పోరాడి ఓటమిపాలైంది. ఓ దశలో అర్జెంటీనాను ఓడించేంత పని చేసినా.. అదనపు సమయంలో తలవంచాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో గెలిచింది అర్జెంటీనా అయినా.. అందరి ప్రశంసలు అందుకున్నది మాత్రం కాబో వెర్డే జట్టే. అర్జెంటీనా జట్టు ఎటాక్‌ను తట్టుకొని.. ప్రతి ఎదురుదెబ్బకు ధైర్యంగా బదులిచ్చింది. సుమారు 120 నిమిషాలపాటు జరిగిన ఉత్కంఠభరిత పోరులో అర్జెంటీనా 3-2తో విజయం సాధించినా.. కాబోవెర్డే ఏమాత్రం వెనుకంజ వేయకుండా గట్టి సవాల్ విసిరింది. చివరకు అదనపు సమయంలో క్రిస్టియన్ రొమెరో గోల్ చేసి అర్జెంటీనాను గెలిపించడం తో మెగా టోర్నీలో కాబో వెర్డే పోరాటం ముగిసింది. ఈ విజయంతో రౌండ్ ఆఫ్-16కు చేరిన అర్జెంటీనా జట్టు.. ఈజిప్ట్‌తో తలపడనుంది.

మెస్సీ మరో మైలురాయి
అర్జెంటీనా స్టార్‌ ఆటగాడు లియోనెల్‌ మెస్సీ ‌మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కాబో వెర్డేపై మరో గోల్‌ కొట్టి ఈ టోర్నీలో తన గోల్స్‌ సంఖ్యను 7కు పెంచుకున్నాడు. 29వ నిమిషంలో లిసాండ్రో మార్టినెజ్ అందించిన అద్భుతమైన లాంగ్ పాస్‌ను మెస్సీ చక్కగా నియంత్రించి, వోజిన్హాపై నుంచి బంతిని లిఫ్ట్ చేస్తూ గోల్ సాధించాడు. అలాగే ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో 20గోల్స్ చేసిన తొలిఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

వోజిన్హా అద్భుత ప్రదర్శన
కాబో వెర్డే గోల్‌కీపర్ వోజిన్హా ఫిఫా ప్రపంప్‌లో లో ప్రత్యేక ఆకర్షణగా నిచాడు డు. అర్జెంటీనా ఆటగాళ్లు వోజిన్హాపై ఒత్తిడి తీసు కొచ్చేంత పని చేసినా.. ప్రశాంతంగా బంతిని తన వద్దే ఉంచుకొని సరైన సమయంలో సహచరులకు పాస్‌ చేశాడు. ఒక దశలో మెస్సీనే పెనాల్టీ బాక్స్‌లోకి ఆహ్వానించినట్టుగా ఆడడం కాబో వెర్డే ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. రెండో అర్ధభాగంలో డెరాయ్ డువార్టే దూరం నుంచి కొట్టిన షాట్‌ను ఎమిలియానో మార్టినెజ్ అడ్డుకున్నాడు. ర్యాన్ మెండెస్ కుడివైపు నుంచి ఇచ్చిన అద్భుతమైన పాస్‌ను డువార్టే టూ టచ్‌ల్లోనే గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. ఈ గోల్ తర్వాత అర్జెంటీనా తడబడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -