Monday, May 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నేల ఆరోగ్య పరిరక్షణకు సేంద్రియ పద్ధతులే మేలు 

నేల ఆరోగ్య పరిరక్షణకు సేంద్రియ పద్ధతులే మేలు 

- Advertisement -

జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ – ఆలేరు రూరల్

తక్కువ యూరియా వినియోగం, పంటల మార్పిడి, సేంద్రీయ వ్యవసాయం,పచ్చిరొట్ట పంటల సాగు వంటి పద్ధతులు నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో అవసరమని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి తెలిపారు.సోమవారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “రైతు వారం” కార్యక్రమం కింద ఆలేరు మండలంలోని పటేల్‌గూడెం రైతు వేదికలో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రైతులకు ముఖ్యంగా నేల ఆరోగ్యం పరిరక్షణపై అవగాహన కల్పించారు.ఇదే కార్యక్రమం కొలనుపాక, గుండ్లగూడెం,శారాజీపేట,గొలనుకొండ రైతు వేదికలలో కూడా నిర్వహించారు.

ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తక్కువ యూరియా వినియోగం, పంటల మార్పిడి, సేంద్రీయ వ్యవసాయం,పచ్చిరొట్ట పంటల సాగు వంటి పద్ధతులు నేల సారాన్ని పెంచి, దీర్ఘకాలంలో మంచి దిగుబడులు సాధించడానికి దోహదపడతాయని తెలిపారు.అలాగే రసాయన మందులను సరైన మోతాదులో, సమయానికి వాడటం ద్వారా పంటలను రక్షించుకోవచ్చని, సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించడం ద్వారా రైతులు లాభాలు పొందగలరని చెప్పారు. ప్రతి రైతు తన కుటుంబ అవసరాలకు సరిపడ ధాన్యం, కూరగాయలను సేంద్రియ పద్ధతిలో పండించాలని సూచించారు. అనంతరంమండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సన్న వరి రకాలైన BPT 5204, RNR 15048, KNM 1638,JGL 1798,జై శ్రీరామ్,HMT, WGL-44,WGL-1962 వంగడాలను సాగు చేయాలని రైతులకు సూచించారు. భూసార పరీక్ష కోసం మట్టి నమూనా సేకరణ విధానాన్ని ప్రదర్శించి, విశ్లేషణ నివేదికలను రైతులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో డీసీఓ మురళి,యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపాలన స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, ఏఈఓ పవన్ కళ్యాణ్, పాక్స్  సీఈఓ వెంకట్ రెడ్డి, పాక్స్  డైరెక్టర్ నర్సింహులు,పటేల్‌గూడెం సర్పంచ్ కుమారస్వామి,శ్రీనివాసపురం సర్పంచ్ శోభన్ బాబు తదితర ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -