తమిళనాడు సీఎం స్టాలిన్
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎం స్టాలిన్ స్పందించారు. రెండోసారి తమదే అధికారం అనుకున్న ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీకి చుక్కెదురైంది. అయితే ఈ చేదు ఫలితాలపై సీఎం ఎంకే స్టాలిన్ భావోద్వేగంతో స్పందించారు. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని పేర్కొన్న డీఎంకే అధినేత.. విజరు పార్టీ టీవీకే పేరెత్తకుండానే విజేతలకు అభినందనలు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పరాజయంతో కంగుతిన్న స్టాలిన్ ఎక్స్ పోస్ట్‌లో రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టిన ఆయన తమ ఐదేండ్ల పాలనలో సాధించిన ఘనతలు వివరిస్తూనే.. ఇకపై ప్రతిపక్షంగా క్రియాశీలక పాత్ర పోషిస్తామని రాష్ట్ర ప్రజలకు వెల్లడించారు. ”’ప్రజల తీర్పును డీఎంకే గౌరవిస్తోంది. ఎన్నికల్లో విజేతలకు అభినందనలు. గత ఐదేళ్లలో తమిళనాడులో ఎన్నో ప్రాజెక్టులు చెపట్టాం. ప్రజలకు మంచి పాలన అందించాం. ప్రతి రంగంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపాం. మా పార్టీ సాధించిన విజయాలను చూసి ఓటెయ్యాలని ఎన్నికల ప్రచారంలో అభ్యర్థించాం. ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు కొనసాగించాలనే ఉద్దేశంతోనే మేము డీఎంకేకు మరోసారి ఓటెయ్యాలని కోరాం. ద్రవిడ మున్నేట్ర కజగం సారథ్యంలోని లౌకిక, అభ్యుదయ కూటమికి ఓటేసిన తమిళ ప్రజలకు నేను హదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. డీఎంకే పార్టీకి ఓటు వేసిన వారి కోసమే కాకుండా ఓటేయ్యని వారి కోసం కూడా మేము పనిచేశాం. రాష్ట్ర ప్రజానీకం పట్ల నేను నిజాయతీగా ఉన్నాను. నా ఆలోచనలకు తగ్గట్టుగా విధులు నిర్వర్తించాను. నా శక్తి కొద్దీ శ్రమించాను. నా ప్రియమైన కరుణానిధి కామ్రేడ్.. నా లెక్కనే ఆయన నిజాయతీగా సేవలందించారు. ఆయనను నా నుంచి వేరు చేయలేరు. ఆయనకు మనసారా కతజ్ఞతలు తెలియజేస్తున్నా” అని వివరించారు. కాగా తనకు కంచుకోట అయిన కళాతుర్ నియోజకవర్గంలో స్టాలిన్ ఓడిపోయారు. గతంలో డీఎంకేలో కీలక నేతగా ఉండి.. టీవీకే తరఫున పోటీచేసిన బీఎస్ బాబు చేతిలో స్టాలిన్ ఊహించని పరాజయం చవిచూశారు.
ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాం
- Advertisement -
- Advertisement -



