Tuesday, May 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంశేరిలింగంపల్లి జోన్‌

శేరిలింగంపల్లి జోన్‌

- Advertisement -

సీఎంసీ కార్యాలయంలో ప్రమాదం జోనల్‌ కమిషనర్‌ ఛాంబర్‌ దగ్ధం
సబ్‌స్టేషన్‌ నుంచి మంటలు కాలిపోయిన ముఖ్యమైన ఫైల్స్‌
నవతెలంగాణ-మియాపూర్‌

సైబర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని హైదరాబాద్‌ శేరిలింగంపల్లి జోన్‌ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు వ్యాపించాయి. షార్ట్‌ సర్క్యూట్‌తో జోనల్‌ కార్యాలయంలోని కమిషనర్‌ ఛాంబర్‌ పూర్తిగా కాలిపోయింది. అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్యాలయానికి ఆనుకొని ఉన్న విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నుంచి పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో.. చెట్ల పైనుంచి ఉన్న వైర్లు కాలుతూ సీఎంసీ జోనల్‌ కార్యాలయం వరకు వ్యాపించాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత ఘటన జరగడంతో అక్కడ ఉద్యోగులెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జోనల్‌ కార్యాలయంలోని కమిషనర్‌ ఛాంబర్‌ కాలిపోవడంతోపాటు టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి సంబంధించిన శేరిలింగంపల్లి సర్కిల్‌ కంప్యూటర్లు కూడా దెబ్బతిన్నాయి. జోనల్‌ కార్యాలయం రెండో అంతస్తులో ఉండగా మొదటి అంతస్తులో శేరిలింగంపల్లి సర్కిల్‌ కార్యాలయాలు ఉన్నాయి. అయితే, శేరిలింగంపల్లి టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో మాత్రమే కంప్యూటర్లు ఎలా దెబ్బతిన్నాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏసీబీ అధికారులు శేరిలింగంపల్లి సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులపై దాడులు నిర్వహించి పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ డేటా మొత్తం కాలిపోయిందా లేక అధికారుల దగ్గర ఉందా? అనే అనుమానాలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -