Tuesday, May 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకుల బహిష్కరణ చేశారని…

కుల బహిష్కరణ చేశారని…

- Advertisement -

కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం
కులంలోకి రానివ్వట్లేదని ఆవేదన
నవతెలంగాణ- నిజామాబాద్‌ సిటీ

చిన్నగొడవ జరిగితే.. దానిపై పంచాయితీలో కులపోళ్లు లేనిపోని మాటలు చెప్పి కుల బహిష్కరణ చేసి మానసిక వేదనకు గురిచేస్తున్నారంటూ ఓ మహిళ కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో సోమవారం జరిగింది. ఆలూర్‌ మండలం డీకంపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక తరగతికి చెందిన బాధితురాలు చిన్మల నల్ల తెలిపిన వివరాల ప్రకారం.. 2022లో సంక్రాంతి పండుగ సమయంలో అదే సామాజిక తరగతికి చెందిన పక్కింటి మహిళతో చిన్మల నల్ల కుటుంబానికి గొడవ జరిగింది. దానిపై కులపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. అప్పటి నుంచి ఆ కుటుంబాన్ని బహిష్కరించారు. మంచీ చెడులకు చిన్మల నల్ల కుటుంబంలోకి రావడం లేదు. ఇతరులెవరూ వారితో మాట్లాడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఈ విషయమై పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ముగ్గురు కలెక్టర్‌లు మారినా తమ సమస్య తీరలేదని బాధితురాలు కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగేందుకు యత్నించింది. గమనించిన పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసినందుకు ఆమెపై రూరల్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -