రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి
నవతెలంగాణ-బచ్చన్నపేట
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రైతులతో కలిసి జనగామ జిల్లా బచ్చన్నపేట ప్రధాన చౌరస్తాలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వరి నాట్లు పెట్టిన దగ్గరనుంచి కోతల కోసి దాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించే వరకు నానా ఇబ్బందులు పడ్డారని అన్నారు.కొనుగోలు కేంద్రాలు ఎంతో ఆర్భాటంతో ప్రారంభించిన, ధాన్యం తరలించడంలో పట్టింపు లేదన్నారు.
క్వింటాళ్ల కొద్ది ధాన్యం కేంద్రాల్లో పేరుకు పోతుంటే, ఇప్పటివరకు మూడు నాలుగు లారీలు కూడా ధాన్యం మిల్లులకు తరలించలేదని అన్నారు. రైతు భరోసా వేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రెండు మూడు రోజుల్లో బచ్చన్నపేటలో అదనపు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోతే, మరో ధర్నాకు సిద్ధమవుతామని హెచ్చరించారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వడ్డేపల్లి మల్లారెడ్డి, బొమ్మన ఆంజనేయులు గౌడ్, కొండి వెంకటరెడ్డి, ఈదులకంటి ప్రతాపరెడ్డి, బైరి వెంకట్, చింతల వెంకట్, మల్లేష్, సిద్ధిరాంరెడ్డి, కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి, వినోద్, అల్వాల ఎల్లయ్య, మధు ప్రసాద్, పరుశురాములు, కరుణాకర్, నరసింహులు, పుల్లయ్య, వెంకట్, ప్రభాకర్ రెడ్డి, అనిల్ సోషల్ మీడియా ఇన్చార్జి పడిగెల కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



