Wednesday, May 6, 2026
E-PAPER
Homeజాతీయం9న బెంగాల్ లో
కొత్త ప్రభుత్వం

9న బెంగాల్ లో
కొత్త ప్రభుత్వం

- Advertisement -

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య
కోల్ కతా: పశ్చిమబెంగాల్లో లో మే 9న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య వెల్లడించారు. నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ రోజు నూతన సీఎం ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. ఠాగూర్ ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఒక కొత్త ఆరంభానికి 9న బెంగాల్ లో కొత్త ప్రభుత్వం నాంది పలకడానికి ఈ తేదీని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పనులు చేస్తున్నామన్నారు. కాగా బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. బెంగాల్ ఎన్నికల ఫలితాల అధికారిక గెజిట్ నోటిఫికేషన్ను ఈసీ ఉన్నతాధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్కు అందజేయ నున్నారు. ఈ అధికారిక పత్రాలను సీఈసీ.. గవర్నర్ ఆర్.ఎన్.రవికి బుధవారం ఇస్తారు. అనంతరం ఆయన రాజీనామా సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆహ్వానిస్తారు. కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసేవరకు మమత ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -