Tuesday, May 5, 2026
E-PAPER
Homeజాతీయంటీవీకేతో కాంగ్రెస్ చ‌ర్చ‌లు

టీవీకేతో కాంగ్రెస్ చ‌ర్చ‌లు

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వ ఏర్పాటు కోసం టీవీకే ముమ్మ‌ర ఏర్పాటు చేస్తోంది. అధికారం చేప‌ట్టానికి 10 సీట్లు కావాల్సి ఉంది. దీంతో టీవీకేకు ప‌లు పార్టీల‌తో పొత్తు అనివార్య‌మైంది. ఫ‌లితాలు వెలువ‌డ‌గానే కాంగ్రెస్, వామ‌ప‌క్షాలు టీవీకేకు తాము మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్‌.. టివికెతో కాంగ్రెస్‌‌తో చర్చలు జరుపుతుందని మంగళవారం మీడియాకు చెప్పారు.

కె.సి వేణుగోపాల్‌ ‌అలప్పుజాలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల్లో డీఎంకెతో కలిసి మేం పోటీ చేశాం. కానీ ఇప్పుడు తమిళనాడులో కొత్త పరిస్తితి తలెత్తింది. ఈ సమయంలో కాంగ్రెస్‌ ఎన్నికల ఫలితాల అనంతరం తలెత్తిన పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది’ అని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -