Tuesday, May 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హెల్త్ క్యాంపుకు భారీ స్పందన

హెల్త్ క్యాంపుకు భారీ స్పందన

- Advertisement -

నవతెలంగాణ-శాయంపేట
భూపాలపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి జన్మదినం సందర్భంగా శాయంపేటలో ని ఎస్ వి కే కే ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన మెగా హెల్త్ క్యాంపుకు భారీ స్పందన లభించింది. ముందుగా కేక్ కట్ చేసి సీట్లు పంపిణీ చేశారు. అనంతరం క్యాంపు కు తరలివచ్చిన జనానికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యల తో బాధపడుతున్న 130 మందికి పరీక్షలు నిర్వహించారు. వినికిడి లోపంతో బాధపడుతున్న 30 మందికి పరీక్షలు చేసి పరికరాలు అందించారు. అదేవిధంగా వికలాంగుల కోటాలో నలుగురికి వీల్ చైర్స్ ఐదుగురికి ట్రై సైకిల్స్ అందజేశారు.

ఈ సందర్భంగా హెల్త్ క్యాంప్ నిర్వాహకులు వైనాల రాజేందర్ మాట్లాడుతూ.. హెల్త్ క్యాంపునకు తరలివచ్చిన జనానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.  వెంకటరమణ రెడ్డి జన్మదినo సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. రానున్న రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కొప్పుల సర్పంచ్ మామిడి అశోక్, మాజీ వైస్ ఎంపీపీ వంగాల  నారాయణరెడ్డి, నాయకులు ధనుంజయ్, సంతోష్ విజయ్ గౌస్ సదానందం ప్రసాద్ రమేష్ ప్రజ్వల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -