Wednesday, May 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరురూరల్ 
ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు బింగి చంద్రయ్య (53) తాటి చెట్టు పైనుంచి జారి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. రోజువారీ పనిలో భాగంగా చెట్టు ఎక్కిన సమయంలో కాలుజారి కిందపడినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి అతడిని ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నాగోల్‌లోని సుప్రజా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రకారం అతనికి ఎడమ చేయి విరగడంతో పాటు వెనుక నడుము భాగంలో గాయాలు అయ్యాయి. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై స్పందించిన గౌడ్ సంఘం నాయకుడు మిట్ట శంకరయ్య గౌడ్ మాట్లాడుతూ.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వం వెంటనే రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -