నవతెలంగాణ – ఆత్మకూరు
మండలంలోని కటాక్షపూర్ చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 21 పశువులతో కూడిన రెండు వాహనాలను పట్టుకుని కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిఐ ఆర్ సంతోష్ తెలిపారు. టిఎస్ 21టి 4819 బోలోరో వాహనంలో 2 ఆవులు,3 దూడలు, 2 ఎద్దులు, 1 గేదె దూడ మొత్తం 8 పశువులను గుర్తించారు. డ్రైవర్ ఎండి. యాసిన్ పాషా, యజమాని ఎండి. సలీంపై నమోదు చేశారు. మరో టిఎస్ 01 యుబి 3081 బోలొరో వాహనంలో 13 గేదె దూడలను క్రూరంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. ఎండి. తుఫాన్, బొక్క సారయ్యపై కేసు నమోదు చేసి నిందితులపై తెలంగాణ గోవధ నిషేధ చట్టం, జంతు హింస నివారణ చట్టం కింద కేసులు నమోదు చేశాం. స్వాధీనం చేసుకున్న పశువులను గోశాలకు తరలించినట్లు సీఐ తెలిపారు. అనుమతులు లేకుండా పశువుల రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్సై తిరుపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



