Thursday, May 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చిండ్రు

మేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చిండ్రు

- Advertisement -

నవతెలంగాణ`వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మేడిగడ్డ బ్యారేజీని బాంబులు పెట్టి పేల్చారని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. హన్మకొండ జిల్లాలోని హంటర్‌రోడ్డు జంక్షన్‌లో బుధవారం జరిగిన ‘రైతు సంగ్రామ సదస్సు’లో ఆయన ప్రసంగించారు. మేడిగడ్డ అవినీతిపై హైకోర్టు తీర్పునిచ్చిందని, ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యాయని అన్నారు. రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే ఎడమకాలి చెప్పుతో కొట్టాలని వ్యాఖ్యానించారు. సరిగ్గా నాలుగేండ్ల కిందట వరంగల్‌లోనే కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. రైతు డిక్లరేషన్‌లో రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి పక్కనపెట్టారన్నారు. హామిలిచ్చిన రాహుల్‌గాంధీ ఎక్కడున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి రెన్యూవల్ సీఎం అని వ్యాఖ్యానించారు.
ధాన్యం కొనుగోళ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షా 32 వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం రైతుబంధును బంద్ పెట్టి రాహుల్‌బంధును ప్రారంభించారని ఆరోపించారు. నెలనెలా ఢిల్లీకి పోయి కప్పం కడ్తుంటారని, లేకుంటే బతుకు దెరువు లేదని ఎద్దేవా చేశారు. ఎకరాకు రూ.15 వేలు రైతుభరోసా ఇస్తానని చెప్పి ఇప్పుడు 12 వేలు మాత్రమే ఇస్తామని చెబుతున్నారని ఆంధ్రులకు సైతం ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని విమర్శించారు. కౌలు రైతులకు రైతుభరోసా నేటికీ ఇవ్వలేకపోయారన్నారు. రాష్ట్రంలో మొత్తం 25 లక్షల మంది కౌలు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25,500 కోట్లు బాకీ పడిందన్నారు. రైతుల రక్తం తాగే పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. కాంగ్రెస్ కరోనా కంటే ప్రమాదకరమన్నారు. రేవంత్‌రెడ్డి, మంత్రుల ఫొటోలను అన్ని పోలీసు స్టేషన్‌ల వద్ద పెట్టి.. దొంగలున్నారు జాగ్రత్త అన్న బోర్డులు పెట్టాలన్నారు.
పంటలను కొనకపోతే రైతులు నాగళ్లను మడతపెట్టి కాంగ్రెస్ నాయకఁలను సరిహద్దుల వరకు ఉరికిస్తరన్నారు. గత 48 గంటల్లో 8 మంది రైతులు ప్రాణం కోల్పోవడం ఆవేదన కల్గించిందన్నారు. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. రైతులు పండించిన పంటను భేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

రూ.3.70 లక్షల కోట్ల అప్పులు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలోనే రూ.3.70 లక్షల కోట్ల అప్పులు చేసిందని కేటీఆర్ చెప్పారు. ఒక్క పూట కడుపు కట్టుకోం టే రూ.50వేల కోట్ల రుణమాఫీ చేయొచ్చన్న సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు కడుపు కట్టుకోవడంలేదని ప్రశ్నించారు. నీకు దమ్ముంటే ఏ వూరికి పోదామో చెప్పు రేవంత్‌రెడ్డి… ఒక్క గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందా ? అఁ ప్రశ్నించారు. వంద శాతం రుణమాఫీ ఒక్క గ్రామంలో జరిగినా రాజకీయాలను వదిలి పోతానన్నారు. రేవంత్ వస్తరా..? తుమ్మల వస్తరా..? చెప్పాలన్నారు.

సమ్మక్క జాతరలో మంత్రుల కక్కుర్తి
సమ్మక్క జాతరలో రూ.70 కోట్ల పనులను దక్కించుకోవడానికి ముగ్గురు మంత్రులు పొంగులేటి శ్రీఁవాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ పంచాయితీ పెట్టుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. మోసపోతే గోస పడ్తమని ఎన్నికలకు ముందే కేసీఆర్ చెప్పారని, అయినా దేశం వదులుకఁన్న దరిద్రాన్ని మనోళ్లు మీదేసుకున్నారని కాంగ్రెస్‌నుద్దేశించి వ్యాఖ్యానిం చారు. సీఎం రేవంత్‌రెడ్డి బట్టెబాజ్ మాటలు మాట్లాడి రైతులను మోసం చేశారన్నారు. 61 సార్లు ఢిల్లీకి పోయి ఏం పీకిండని ఎద్దేవా చేశారు. మా రైతులు తలుచుకఁంటే నువ్వెంత..? నీ కాంగ్రెస్ ఎంత ? అన్నారు. రేవంత్ కు మళ్లీ గెలవబోమని తెలుసన్నారు. ఈ క ర్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ డాక్టర్ బండా ప్రకాశ్, మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, డిఎస్ రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, సతీశ్ , నన్నపనేని నరేందర్, నాగుర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -