– నెట్‌వర్క్ స్లైసింగ్ పేరుతో ప్రీమియం చార్జీలు
– ఆదాయమే లక్ష్యంగా జియో, ఎయిర్‌టెల్ ఎత్తుగడలు
– ట్రాయ్‌తో సంప్రదింపులు..!
హైదరాబాద్:: దేశంలోని ప్రయివేటు టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ సామాన్య వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వరుస చార్జీల పెంపునతో త్రీవ భారం మోపుతున్న ఈ టెలికం కంపెనీలు వినియోగ దారులను మరింత పిండేసుకోవడానికి టెలికం శాఖ వర్గాలతో తీవ్రంగా సంప్రదింపులు చేస్తున్నా యని రిపోర్టులు వస్తున్నాయి. 5జీ వినియోగ దారుల నుంచి నెట్‌వర్క్ స్లైసింగ్ పేరుతో కొత్త చార్జీల వసూలుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటివరకు ఉచితంగా లేదా 4జీ ధరకే లభించిన 5జీ సేవలు ఇకపై ప్రీమియం ట్యాగ్‌తో భారంగా మారనున్నాయి.
అదనపు వసూళ్లకు అస్త్రం..
ప్రస్తుతం అందరికీ ఒకే రకమైన నెట్‌వర్క్ అందుబాటులో ఉండగా ఇకపై ఆ నెట్‌వర్క్‌ను ముక్కలు చేసి (స్లైసింగ్) నాణ్యమైన సేవలు కావాలనుకునే వారి వద్ద నుండి అదనపు వసూళ్లు చేయాలని జియో, ఎయిర్‌టెల్ భావిస్తు న్నాయి. అంటే అధిక వేగం లేదా తక్కువ లాటెన్సీ (తక్కువ సమయంలో వేగంగా సమాచారం) కావాలంటే కస్టమర్లు తమ సాధారణ ప్లాన్ల కంటే ఎక్కువ ధర కలిగిన ప్రీమియం ప్లాన్లు తీసుకో వాల్సి ఉంటుంది. ఇది పరోక్షంగా సామాన్య విని యోగదారులను తక్కువ నాణ్యత కలిగిన నెట్ వర్క్‌కే పరిమితం చేసి డబ్బున్న వారికి ఫాస్ట్ లేన్ కేటాయించడమేనని నిపుణులు భావిస్తు న్నారు.
నెట్ న్యూట్రాలిటీకి ముప్పు..
టెలికాం కంపెనీల ఈ నిర్ణయం అందరికీ సమానమైన ఇంటర్నెట్ (నెట్ న్యూట్రాలిటీ) సూత్రానికి విరుద్ధమనే ఆందోళనలు వెల్లువెత్తుతు న్నాయి. ఇంటర్నెట్ సేవల్లో విచక్షణ చూపకూడ దనే నిబంధనలు ఉన్నప్పటికీ.. సాంకేతికత పేరుతో కంపెనీలు విభిన్న టారిఫ్ ప్లాన్లను తీసు కురావాలని చూస్తున్నాయి. ఒకవేళ ట్రారు దీనికి గ్రీన్ సిగల్ ఇస్తే గతంలో డేటా ధరలతో పోటీ పడిన కంపెనీలు.. ఇప్పుడు ప్రీమియం సేవల పేరుతో వినియోగదారుల నుంచి భారీగా దండుకునే అవకాశం ఉంది.
5జీతో పిండేసే పనిలో టెల్కోలు
- Advertisement -
- Advertisement -



