– తక్కువ ధరకు లబ్దిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వ ఆలోచన
– పేదలకు పౌష్టికాహారం.. మధ్యవర్తుల దందాకు చెక్ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతుల నుంచి మక్కజొన్న, జొన్న పంటను సేకరించి, రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేసే ఆలోచన చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. తద్వారా ఆ పంటలు పండిస్తున్న రైతులకు భరోసా కల్పిస్తామన్నారు. సేకరించిన ధాన్యాన్ని మార్కెట్ ధర కంటే తక్కవ ధరకు రేషన్ దుకాణాల ద్వారా నేరుగా పేద ప్రజల చెంతకు చేర్చేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకు న్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఈ పంటలను బహిరంగ మార్కెట్‌లో వేలం వేసి మధ్యవర్తులకు లాభం చేకూర్చకుండా, సివిల్ సప్లై శాఖ ద్వారా రేషన్ షాపుల లో పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని పేర్కొన్నారు. పంట పండించిన రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో మొక్కజొన్న, జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేశారు.
మధ్యవర్తుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, సేకరించిన ధాన్యాన్ని ప్యాకింగ్ చేయించి నేరుగా ప్రజలకు తక్కువ ధరకు పంపిణీ చేస్తామని తెలిపారు. ‘ధాన్యం కేవలం మార్కెట్ సరుకుగా మిగిలిపోకూడదు. అది పేదవాడి ఆకలి తీర్చి, పౌష్టికాహారంగా మారాలి’ అని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం వల్ల కేవలం సామాన్యులకే కాకుండా సంక్షేమ వసతి గహాల్లో చదువుకునే వేలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించేలా మొక్కజొన్న, జొన్నల సరఫరాకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ రంగాన్ని ఆదుకునేందుకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు పౌల్ట్రీ రైతులకు అవసరమైన మేరకు కూడా సరఫరా చేయాలని ఆదేశించారు.
రేషన్‌షాపుల ద్వారా జొన్న, మక్కల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



