అకాలవర్షాలతో రైతన్నలు విలవిల
కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో తడిసిన ధాన్యం, మక్కలు
పంట కాపాడుకోవడం కోసం వెళ్లి నలుగురు రైతుల దుర్మరణం మృతుల్లో తండ్రీకొడుకులు
ఇప్పటికే ధాన్యం రాసులపై గుండెలు ఆగి ఏడుగురి మరణం
ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతాంగం ఆగ్రహం
పలుచోట్ల రోడ్డెక్కిన రైతులు…ఆందోళనలు
నవతెలంగాణ-భూపాలపల్లి/మెదక్ విలేకరులు
అన్నదాత ఆగమవుతున్నాడు. పోయే ప్రాణాలు పోతూనే ఉన్నాయి. పాలకుల్లో మాత్రం చలనం లేదు. మార్కెట్‌యార్డుల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వ యంత్రాగం ఇప్పటికీ చోద్యం చూస్తూనే ఉంది. షావుకార్ల దగ్గర అప్ప్పులు తెచ్చి, సాగుచేసిన కౌలు రైతులు ఇప్ప్పుడు ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తున్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించి సీపీఐ(ఎం) నేతలతో పాటు రైతు సంఘాల నేతలు పంట కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నా, అధికారగణంలో చలనం లేదు. ఈ నిర్లక్ష్య ఫలితంగానే మంగళవారం అర్థరాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులు, వడగండ్ల వానలతో అన్నదాత మరోసారి కుదేలయ్యాడు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యానికి కావలి ఉండేందుకు వెళ్లిన నలుగురు రైతులు అకాలమరణం చెందారు. వారిలో తండ్రీ కొడుకులు ఉండటం హృదయాన్ని పిండేస్తుంది.లుంటలు పండించడమే వాళ్లు చేసిన నేరమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు ఐక్యం అవుతున్నాయి. గడచిన 15 రోజుల్లో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చిన రైతులు వాటిని కొనే దిక్కు లేక ఆ రాసులపైనే ఏడుగురు ప్రాణాలొదిలారు. అయినా ప్రభుత్వ యంత్రాంగంలో చలనం లేదు. తమకేం పట్టనట్టు, బాధ్యత లేనట్లే వ్యవహరిస్తున్నారని రైతుసంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
బీఆరఎస్ నేతలు కూడా కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారు. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. అకాల వర్షాలతో ఐకేసీ కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కొట్టుకు పోయింది. ఉన్న కొద్దీ గొప్ప రాసుల్లో కింది నుంచి మొలకలు వస్తున్నాయి. అది చూసి రైతుల గుండెలు ఆగుతున్నాయి. కడుపు మండిన అన్నదాతలు పలుచోట్ల రోడ్డెక్కారు. ఆందోళనలు చేశారు. ప్రభుత్వం స్పందించాలని నినదించారు. ఇంత జరుగుతున్నా కొనుగోళ్లలో లోటుపాట్లు ఎందుకు జరుగుతున్నాయనే క్షేత్రస్థాయి పర్యటనలకు పౌరసరఫరాల శాఖ మంత్రి సహా స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ వెళ్తున్న దాఖలాలు లేవు. ఏదైనా ఘటన జరిగినప్ప్పుడు కేవలం అధికారులు మాత్రమే అక్కడ హడావిడి చేస్తున్నారు. ప్రతి గింజా కొంటాం అని ప్రభుత్వాధినేతలు పత్రికల్లో ప్రకటనలు చేస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవనే వాస్తవాలను గమనించట్లేదు. దీన్ని రైతాంగం తీవ్రంగా ఆక్షేపిస్తుంది. మక్క రైతులదీ ఇదే పరిస్థితి.
మక్కల్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అవికూడా అకాల వర్షాలకు తడిసి రైతులకు గుండెకోతను మిగులుస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు లేవు…ఉన్నవి ఈదురుగాలులకు కొట్టుకుపోయాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం మట్టికొట్టుకుపోయింది. అన్నదాత ఆగం కావడంలో భాగస్వామి అయిన ప్రభుత్వ బాధ్యతను ప్రశ్నించాల్సిందే!నష్టం ఇలా…జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవడంతో కల్లాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. భూపాలపల్లి, గణపురం, రేగొండ చిట్యాల, కాటారం మహా ముత్తారం, మలహర్ మండలాల్లో పంట నష్టం తీవ్రంగా జరిగింది. గణపురం మండలం మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి, మొరంచపల్లి గ్రామాల్లో ఐకెపి సెంటర్లు, కల్లాల వద్ద ఆరబోసిన వడ్లు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. తడిసిన ధాన్యాన్ని తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే మద్దతు ధరకఁ కొనుగోలు చేయాలని, ప్రతి గ్రామంలోనూ పక్కా కల్లాల షెడ్లు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. కాగా, ధాన్యం కల్లాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించి రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు.
ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందఁ భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని తక్షణమే కాటారంలోని అన్నపూర్ణ పారబాయిల్ రైస్ మిల్లుకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సిద్దిపేటలో..సిద్దిపేట జిల్లాల్లోని గజ్వేల్, జగదేవపూర్, మర్కుక్, దుబ్బాక మండలాల్లో వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. చేతికొచ్చిన వరి పంట నేలకొరిగింది. పక్వపు దశకనికి వచ్చిన పంట గాలివానకు నేలవాలింది. వడగండ్లు భీభత్సం సృష్టించాయి. గజ్వేల్ పట్టణంలో 25 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. పట్టణంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు పడిపోయాయి. గజ్వేల్ మండలం దాతర్‌పల్లి గ్రామంలో జూపల్లి మనమ్మ ఇంటి పైకప్పు ఈదురు గాలులు, వర్షాఁకి కూలింది. అదే గ్రామాఁకి చెందిన చిన్నతోట గోపాలకృష్ణకఁ చెందిన కోళ్ల ఫారం షెడ్డు.. రేకఁలతో సహా గాలికి కొట్టుకు పోయింది. సుమారు రూ.6 లక్షలు నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. మర్కుక్ మండలంలో ఆరబోసిన ధాన్యం తడిసింది.పెద్దపల్లిలో..పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం, అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో పంటలు నీట మునిగాయి.
పదిరోజుల క్రితం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చినా, అధికారులు సకాలంలో తూకం వేయకపోవడంతో నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం, ఓదెల మండలాల్లో అపార పంటనష్టం ఏర్పడింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన అన్ని కొనుగోలు కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. తక్షణం స్పందించకఁంటే ప్రభుత్వానికి రైతుల నిరసన సెగ తగలడం ఖాయంగా కనిపిస్తుంది. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనాలిసడాల శ్రీకాంత్` కొంపల్లి సర్పంచ్ కాయకష్టం చేసి పండించిన పంట అకాల వర్షం కారణంగా తడిచి ముద్దయింది. రైతులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. తడిచిన పంటను వెంటనే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా కొనుగోలు చేయాలి. రైతులను ఆదుకోవాలి.కష్టం నీటిపాలు.. : మాజీ ఆదర్శ రైతు పోతుల రవిఎకరాకఁ రూ.30వేలు పెట్టుబడి పెట్టి పంట పండించాం. కోత పూర్తయ్యి అమ్ముదామనుకునే లోపే వాన దెబ్బకొట్టింది. తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనరు. కొన్నా తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తారు. రైతులకు అధికారులు న్యాయం చేయాలి.



