అధికార లాంఛనాలతో నిర్వహణ
నివాళులర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే,
మాజీ మంత్రి, నాయకులు
నవతెలంగాణ-బీబీనగర్
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి (83) అంత్యక్రియలు బుధవారం పూర్తయ్యాయి. ఆయన స్వగ్రామం బీబీనగర్ మండ లం బ్రాహ్మణపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంచనాల మధ్య నిర్వహించారు. పోలీసులు గాల్లోకి రెండు రౌండ్ లు కాల్పులు జరిపి నివాళులర్పించారు. అంతకుముందు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కొమ్మిడి నరసింహారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం వారు నరసింహారెడ్డి అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు.
నరసింహారెడ్డి మృతి ఈ ప్రాంతానికి తీరని లోటు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్
కొమ్మిడి నరసింహారెడ్డి మృతి భువనగిరి ప్రాంతానికి తీరని లోటని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్ అన్నారు. నరసింహారెడ్డి భౌతికకాయాన్ని సీపీఐ(ఎం) నాయకులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. వారి వెంట జిల్లా నాయకులు కోమిటీ రెడ్డి చంద్రా రెడ్డి, బండార శ్రావణ్ కుమార్, పొట్ట యాదమ్మ, ఓవల్ దాస్ సతీష్, బండారు శ్రీరాములు, గాడి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ప్రజాప్రతినిధుల నివాళులు
మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి భౌతికకాయాన్ని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ చింతల వెంకటేశ్వర్ రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. అదేవిధంగా నాయకులు గోలి పింగల్ రెడ్డి, పంజాల రామాంజనేయులు గౌడ్, పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, జిల్లా పోలీసు అధికారులు, ఆర్డీవో వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మార్వో శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ ఎమ్మార్వో భగత్ నివాళులర్పించారు.
మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి అంత్యక్రియలు పూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


