న్యూఢిల్లీ : వ్యాపార కార్యకలాపాల్లో కత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని పెంచుతున్న క్రమంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఫ్రెష్‌వర్క్స్ తమ గ్లోబల్ వర్క్‌ఫోర్స్ లో 11 శాతం మంది.. అంటే దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్న ట్టు ప్రకటించింది. నాస్‌డాక్లో లిస్ట్ అయి న ఈ కంపెనీ జనవరి-మార్చి త్రైమా సికంలో తన ఆదాయాన్ని 16శాతం పెం చుకుంటున్నప్పటికీ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ తొలగిం పుల వల్ల కంపెనీపై సుమారు 8 మిలి యన్ డాలర్ల వన్-టైమ్ రీస్ట్రక్చరింగ్ భారం పడనుందని, దీనిని ఏప్రిల్-జూన్ కాలానికి అకౌంట్ చేయనున్నట్టు సంస్థ తెలిపింది. ఫ్రెష్‌వర్క్స్ మార్చి త్రైమా సికంలో 228.6 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించి అనలిస్టుల అంచనా లను అధిగమించింది. ఏఐ అడాప్షన్ పెరగడం వల్ల ఉత్పాదకత పెరిగిందని.. అయితే సంస్థను మరింత సమర్థవం తంగా పునర్నిర్మించే క్రమంలోనే ఈ ఉద్వాసనలు చేపట్టినట్టు పేర్కొంది. భారీగా ఆదాయం పెరిగినప్పటికీ, సాంకే తిక మార్పుల కారణంగా ఉద్యోగాల కోత విధించడం టెక్ పరిశ్రమలో ఏఐ ప్రభావానికి మరో ఉదాహరణగా నిలిచింది.



