- Advertisement -
– టన్నుకు రూ. 200 మేర పెంచుతూ నిర్ణయం
హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ తాజాగా ఇనుప ఖనిజం ధరలను టన్నుకు రూ.200 మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు మే 6 నుంచి అమల్లోకి వచ్చాయని ఆ సంస్థ బుధవారం ఓ ప్రకటన లో తెలిపింది. బైలా లంప్ ధర టన్నుకు రూ. 5,500గా, బైలా ఫైన్స్ ధర రూ. 4,700గా నిర్ణయించినట్టు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ధరలను సవరించడం ఇది రెండోసారి. దేశీయంగా ఉక్కు తయారీకి కీలకమైన ముడిసరుకు అయిన ఇనుప ఖనిజం ధరలు పెరగడం, సంబంధిత పరిశ్రమలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీ ఈ పెంపును చేపట్టింది.
- Advertisement -


