నవతెలంగాణ-హైదరాబాద్: ఈ నెల13 నుంచి 21 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఇవాళ హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు అధికారులు రిలీజ్ చేయనున్నారు. తొలుత కాలేజీల లాగిన్ లో పెట్టి, రెండు రోజులకు స్టూడెండ్ల వాట్సప్ కు పంపించనున్నారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ నెంబర్‌తో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
కాగా, ఈ ఏడాది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 3,97,997 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. దీంట్లో జనరల్ విభాగంలో మొత్తం 3,69,294 మంది, ఒకేషనల్ విభాగంలో 28,703 మంది విద్యార్థులు పరీక్షలకు అటెండ్ కానున్నారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 2,67,141 మంది ఉండగా, సెకండియర్ నుంచి 1,30,856 మంది విద్యార్థులు ఉన్నారు.



