నవతెలంగాణ-హైదరాబాద్: పంజాబ్, చండీగఢ్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా నోట్ల కట్టలతో నిండిన సంచులు దొరికినట్లు తెలుస్తోంది. వెస్ట్రన్ టవర్స్‌లోని ఓ ఫ్లాట్‌లో సోదాలు చేస్తుండగా.. రూ.500 నోట్లతో నిండిన రెండు సంచులను తొమ్మిదో అంతస్తు నుంచి పడేసినట్లు సమాచారం. నేలపై నోట్ల కట్టలు పడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు నగదు సంచులు దొరికినట్లు ఈడీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఆ వీడియోలను ఎస్ఏడీ నాయకుడు బిక్రమ్ సింగ్ మజితియా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈడీ దాడుల సందర్భంగా నగదును ఇలా పడేశారంటూ పోస్టులో పేర్కొన్నాడు. దీంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.
పంజాబ్‌లో ఈడీ రైడ్స్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



