Thursday, May 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకరీంనగర్‌లో ఉద్రిక్తత.. కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ నాయ‌కుల దాడి

కరీంనగర్‌లో ఉద్రిక్తత.. కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ నాయ‌కుల దాడి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కరీంనగర్ టౌన్‌లో ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ పై పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా.. ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ నేతలు దాడి చేశారు. క్యాంప్ ఆఫీసులో ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. క్యాంప్ ఆఫీస్ అద్దాలు పగలగొట్టి , ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దాడి సమయంలో క్యాంప్ ఆఫీసులోనే ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని గదిలోకి తరలించారు బీఆర్ఎస్ నేతలు. పోలీసులు క‌లుగ‌జేసుకుని పలువురు బీజేపీ నేతలను అడ్డుకుని అరెస్ట్ చేశారు. బీజేపీ దాడిని బీఆర్ఎస్ నేతలు ఖండించారు.

కాగా, మే 7న ఉదయం పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కేంద్రమంత్రి బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని, బండి సంజయ్ ఒక బాధ్యత గల హోంశాఖ సహాయ మంత్రిగా విఫలమయ్యారని విమర్శించారు. బండి సంజయ్ ఆఫీస్‌కు కూతవేటు దూరంలో భారీ దోపిడీ జరిగితే ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారని కౌషిక్ రెడ్డి ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -