Thursday, May 7, 2026
E-PAPER
Homeఆటలుఐపీఎల్ పాయింట్ల‌ ప‌ట్టిక‌..టాప్‌లో హైద‌రాబాద్‌

ఐపీఎల్ పాయింట్ల‌ ప‌ట్టిక‌..టాప్‌లో హైద‌రాబాద్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఐపీఎల్‌లో లీగ్ మ్యాచ్‌లు ముగింపు ద‌శ‌కు చేరుకుంటున్నాయి. లీగ్‌ దశలో 48 మ్యాచ్‌లు ముగిశాయి. ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఎవరి సొంతమయ్యేది తేల్చేందుకు మరో 22 మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి మేటి జ‌ట్లుగా భావించిన టీంలు చేతిక‌ల‌బ‌డ్డాయి. ఆరంభంలో ఆద‌ర‌గొట్టినా చివ‌రి నిమిషంలో ఓట‌ములు చ‌విచూస్తున్నాయి. ఈక్ర‌మంలోనే ఐపీఎల్ పాయింట్ల పట్టిక‌లో హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ అగ్ర‌స్థానానికి చేరుకుంది. బుద‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పై హైద‌రాబాద్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో స‌న్ రైజ‌ర్స్ మూడో స్థానం నుంచి టాప్‌లోకి వెళ్లిపోయింది.

టోర్నిలో మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన హైద‌రాబాద్ ఏడు గెలిచి, 4 ఓడిపోయింది. మొత్తం 14 పాయింట్లు సాధించి టాప్‌లో ఉంది. రెండో స్థానంలో పీబీకేఎస్ ఉండ‌గా, ఆర్స‌బీ మూడు, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నాలుగో స్థానంలో ఉన్నది. జీటీ, సీఎస్కే ఐదు, ఆరో స్థానంలో ఉన్నాయి. మొద‌ట్లో జోరు మీదున్న‌ ఢిల్లీ వ‌రుస ఓట‌ముల‌తో ఏడు స్థానానికి ప‌డిపోయింది. ప్ర‌స్తుతానికి ఆ జ‌ట్ట‌కు 8 పాయింట్లు ఉన్నాయి. ప్లే ఆప్ రేసులోకి రావాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో త‌ప్ప‌క గెలువాలి. ఇక‌ చివ‌రి రెండు స్థానాల్లో ముంబాయి, ల‌క్నో టీంలు ఉన్నాయి.

అదే విధంగా ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌లో చోటు కోసం 14 పాయింట్లు అవసరం. పోటీ ఎక్కువగా ఉంటే కనీసం 16 పాయింట్లు కావాలి. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం 12 పాయింట్లతో నిలిచిన జట్లు కనీసం మరో రెండు విజయాలు సాధించాల్సిన అవసరం ఉంటుంది. ప్లే ఆఫ్స్‌ బెర్త్‌తో సంతృప్తి చెందని జట్లు.. టాప్‌-2లో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి.

మ‌రోవైపు ఐపీఎల్ ఫైన‌ల్ వేదిక మారింది. బెంగుళూరు నుంచి అహ్మదాబాద్ మార్పు చేశారు. మే 31న ఫైనల్‌ అహ్మదాబాద్ జ‌ర‌గ్గా, మే 26న‌ క్వాలిఫయర్‌-1 ధర్మశాల, మే 27న‌ ఎలిమినేటర్ మ్యాచ్‌ న్యూ చండీగఢ్‌, మే 29న‌ క్వాలిఫయర్‌-2, న్యూ చండీగఢ్‌లో మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -