అమ్రాబాద్‌లో కలకలం ..
భర్తను చంపిన భార్య.. సహకరించిన పిల్లలు?
పోలీసుల గాలింపు చర్యలు
నవతెలంగాణ-అచ్చంపేట
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలో గోనె సంచిలో శవం కనిపించటంతో కలకలం రేపింది. ఓ వ్యక్తి అనుమానస్పద హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. అమ్రాబాద్ ఎస్సై హనుమంత్ రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్రాబాద్‌లో నివాసముంటున్న బుర్రాన్ మూడు రోజుల కిందట హత్యకు గురైనట్టు తెలుస్తుండగా, మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి ఓ పెట్టెలో కుక్కి గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు భార్య, ఇద్దరు కుమారులు ప్రయత్నించినట్టు సమాచారం. అయితే మృతదేహాన్ని తరలించడం సాధ్యం కాకపోవడంతో ఇంట్లోనే వదిలేసి ఇంటికి తాళం వేసి వారు పరారైనట్టు తెలుస్తోంది. కొంతకాలంగా ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అమ్రాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తాళాలు తెరచి మృతదేహాన్ని గుర్తించారు. క్లూస్ టీమ్‌ను రంప్పించి ఆధారాలను సేకరించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమా.? హత్యకు దారితీసిన పరిస్థితులు ఏమిటీ.? మృతదేహాన్ని పెట్టెలో కుక్కి తరలించేందుకు ఎందుకు ప్రయత్నించారు.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గోనె సంచిలో శవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



