నవతెలంగాణ-కుభీర్
కుభీర్ నూతన ఎంపీడీఓ గా అష్టం బీమేష్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఇంత కాలం పనిచేసిన గంగసాగర్ రెడ్డి మామడ మండల ఎంపీడీఓ గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో మండల ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న బీమేష్ కు కుభీర్ ఎంపీడీఓ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్బంగా అష్టం బీమేష్ కు మండల పంచాయతీ కార్యదర్శిలు, సిబ్బంది శాలవా పూలమాలతో ఘనంగా సన్మాంచారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ.. మండల ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ పంచాయతిల అభివృద్దికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పనులు మరింత వేగంగా అయ్యేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కుభీర్ ఎంపీడీఓ గా అష్టం బీమేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



