Thursday, May 7, 2026
E-PAPER
Homeసినిమాకథ మీద నమ్మకంతోనే ప్రకటించా..

కథ మీద నమ్మకంతోనే ప్రకటించా..

- Advertisement -

‘మల్లెపూవు’, ‘మెంటల్‌ కృష్ణ’, ‘కలవరమాయే మదిలో’ లాంటి విజయవంతమైన సినిమాలను నిర్మించి, అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు మోహన్‌ వడ్లపట్ల. లేటెస్ట్‌గా ఆయన దర్శకత్వంలో ‘ఎం4ఎం’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అమెరికన్‌ నటి జో శర్మ ప్రధాన పాత్రలో మోహన్‌ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఎం4ఎం’. ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సౌత్‌ ఇండియాలో పీవీఆర్‌ ఐనాక్స్‌ పిక్చర్స్‌, నార్త్‌ ఇండ ియాలో జేవీఈఎల్‌, ఓవర్సీస్‌ టెక్‌ఫ్లిక్స్‌ ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మోహన్‌ వడ్లపట్ల మీడియాతో ముచ్చటించారు. అమెరికాలో సీరియల్‌ కిల్లర్స్‌ కాన్సెప్ట్‌ చాలా ఫేమస్‌. ‘వాట్‌ ఈజ్‌ ద మోటివ్‌ బిహైండ్‌ దిస్‌ మర్డర్‌?’ అని ఆలోచించినప్పుడు, ‘మోటివ్‌ ఫర్‌ మర్డర్‌’ అని ఫిక్స్‌ అయ్యాం. దానికి షార్ట్‌ కట్‌ గానే ‘ఎం4ఎం’ అని టైటిల్‌ పెట్టాం. పక్కా స్క్రీన్‌ ప్లేతో క్రిస్ప్‌గా ఎడిట్‌ చేసి హాలీవుడ్‌ స్టైల్‌ లో కేవలం 90 నిమిషాల సినిమాగా రెడీ చేశాం. సినిమా రిలీజ్‌కి ముందే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కి పంపాం. దాదాపు 25-30 అవార్డ్స్‌ వచ్చాయి. కానీ అందులో ఐఎమ్‌డిబి గుర్తించినవి 15 అవార్డ్స్‌. ఇందులో బెస్ట్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ యాక్ట్రెస్‌, బెస్ట్‌ మ్యూజిక్‌కి అవార్డ్స్‌ ఉన్నాయి. అలాగే కేన్స్‌, ఇఫీలో కూడా ప్రీమియర్స్‌ వేశాం. ఈ సినిమాలో సీరియల్‌ కిల్లర్‌ ఎవరో చెబితే, లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించాం. దీనికి కారణం. ఈ కథను నేను చాలా ట్విస్ట్‌ అండ్‌ టర్న్స్‌తో రాసుకున్నాను. కిల్లర్‌ ఎవరో అనే సస్పెన్స్‌ సినిమా చివరి వరకు ప్రేక్షకులను వెంటాడుతుంది. అందుకే ఎవరైనా కిల్లర్‌ పేరు చెప్పినా, వారు పూర్తి కథను గెస్‌ చేయలేరని నా నమ్మకం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -