త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. సిహెచ్‌విఎస్‌ఎన్ బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ ఈ చిత్రాన్ని వరల్డ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తు న్నారు. ఈనెల 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత అరవింద్ మాట్లాడుతూ,’ఈ సినిమా చాలా క్రియేటీవ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. పాయల్, త్రిగుణ్ అందరూ మంచి టీమ్‌వర్క్‌తో చేశారు. ఇందులో విజువల్స్, మ్యూజిక్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇది అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్. ఈ సమ్మర్‌లో ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాను థియేటర్స్‌లో చూడండి. నచ్చితే పదిమందికి చెప్పండి. రాందాస్ మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమాను గ్రాండ్‌గా మీ ముందుకు తీసుకొస్తున్నారు’ అని తెలిపారు.
‘ఈ సినిమా మనం రోజువారీగా చూసే పాత్రలు, సంఘటనలతో సరదాగా ఉంటుంది. అలాగే ఇందులో అద్భుతమైన ప్రేమకథ ఉంటుంది. ఆ ప్రేమకథలోని కాన్ఫ్లిక్ట్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. సమ్మర్‌లో అందరూ ఎంజారు చేసే సినిమా. ఈ సినిమాలో చూపించిన క్లైమాక్స్ కూడా నిజ జీవితానికి ఉపయోగపడుతుంది’ అని డైరెక్టర్ మధుదీప్ చెప్పారు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ,’తాజాగా ‘పాపం ప్రతాప్’తో విజయం రావడం ఆనందంగా ఉంది. ఇందులో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్’ అని తెలిపారు.
హీరో త్రిగుణ్ మాట్లాడుతూ,’ఇది ఫుల్ ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మంచి కాన్సెప్ట్ కూడా ఉంటుంది. చాలా మంచి సినిమా తీసుకొస్తున్నాం’ అని అన్నారు. డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ, ”ఈషా’తో విజయాన్ని అందుకున్న త్రిగుణ్, ‘పాపం ప్రతాప్’తో మంచి ప్రశంసలు అందుకున్న పాయల్ రాధాకష్ణ ఈ చిత్రంలో చాలా చక్కగా నటించారు. ఈ సినిమాని చాలా మంచి కాన్సెప్ట్‌తో రూపొందించారు. మంచి కాన్సెప్ట్ ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తాయి. ఇందులో కూడా అలాంటి మంచి కాన్సెప్ట్ ఉంది. నిర్మాత అరవింద్ మంచి ప్యాషన్‌తో నిర్మించారు. ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి, సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
సమ్మర్ స్పెషల్‌గా వస్తున్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
- Advertisement -
- Advertisement -



