ఆశిష్ హీరోగా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం ‘దేత్తడి’. ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ సెకండ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించారు. ఆశిష్‌తో పాటు కీలక నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో హై ఎమోషన్‌తో పాటు కొత్తగా చూపించే కల్చరర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ ఉండబోతోంది. ఆశిష్ పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించడమే కాకుండా, ఒరిజినల్ హైదరాబాద్ స్లాంగ్‌లో డైలాగ్స్ చెప్పబోతున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ జునైద్ కుమార్ అందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు క్రియేటివ్ హెడ్‌గా కూడా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, కథ, దర్శకత్వం: అదితిరావు గంగసాని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి పున్నా (బిట్టు).



