Friday, May 8, 2026
E-PAPER
Homeనల్లగొండఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు

- Advertisement -
  • అడిషనల్ కలెక్టర్ బి.హరి సింగ్..
    నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్:
    జిల్లాలో మే 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బి.హరి సింగ్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ చాంబర్‌లో విద్యాశాఖ అధికారులతో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలపై విద్యా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మే 13 నుంచి మే 21 వరకు థియరీ పరీక్షలు జరుగుతాయని, మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9:00 నుండి 12:00 వరకు, రెండో సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు, వెలుతురు, ఫస్ట్ ఎయిడ్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా సిసి కెమెరాల నిఘా, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసేలా వాతావరణం కల్పించాలని, ఇన్విజిలేటర్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఐఈఓ బి సులోచన రాణి, బాను నాయక్, ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -