- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్
సంప్రదాయ చేనేత కళను ప్రపంచానికి చాటిచెప్పి, తమ ప్రతిభతో పద్మశ్రీతో పాటు ఇప్పుడు డాక్టరేట్ గౌరవాన్ని అందుకోవడం ప్రతి తెలుగు వారికీ, పద్మశాలి సమాజానికీ ఎనలేని గర్వకారణమని స్థానిక యువజన నాయకులు బిర్కూరి ప్రదీప్ అన్నారు. ఈ సందర్భంగా ఆలేరు పట్టణంలో బుధవారం క్రాంతి నగర్ లో చింతకింది మల్లేశంను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి, భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పి సంపత్, కాలనీ వాసులు బి జహంగీర్, కె.చందు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



