Wednesday, July 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేనూర్ మోడల్ హాస్టల్‌ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డిఓ

మేనూర్ మోడల్ హాస్టల్‌ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డిఓ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మండలంలోని మేనూర్ మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థులకు నాసిరకం భోజనం అందిస్తున్నారనే సమాచారం ఎట్టకేలకు భాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డికి చేరింది. ఈ క్రమంలో తాజాగా బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం తప్పనిసరిగా అందించాలని హాస్టల్ ఇంచార్జీ ని ఆదేశించారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి భోజనం పెడతారా.? విద్యార్థులను మీ సొంత పిల్లలుగా భావించి చూసుకోవాలన్నారు. స్టోర్ రూంలో ఉన్న బియ్యం, పప్పు దినుసులు, నూనె, గుడ్లు, ఇతర వంట సామాగ్రిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. బియ్యం సరఫరాలో నాసిరకం వస్తే వెంటనే రిటర్న్ చేసి మంచి నాణ్యత గల బియ్యం తెప్పించాలన్నారు. హాస్టల్‌లో పరిశుభ్రత, మెనూ ప్రకారం భోజనం, తాగునీటి సౌకర్యాలపై కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంక్షేమంలో ఎలాంటి రాజీ లేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం డి ముజీబ్ , స్కూల్ ప్రిన్సిపాల్ హాస్టల్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -