నవతెలంగాణ-వర్ధన్నపేట
వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధికి తాను కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. వర్ధన్నపేట కట్ట మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి స్థానిక ప్రజాప్రతినిధులు వారికి ఘనంగా సన్మానం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా సీడీఎఫ్, మున్సిపల్ నిధులతో రూ.4.99 లక్షలతో నిర్మిస్తున్న కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయ ప్రాంతంలో విద్యుత్ దీపాల ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు అనుగుణంగా దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు, ప్రజల సహకారంతో వర్ధన్నపేటను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే నాగరాజు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మని శేఖర్ రావు, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ నేతావత్ శిభారాణి-రాజేందర్, కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, నునావత్ కమ్లీ-కీమా నాయక్, మలోత్ దేవేందర్, తిరుపెళ్లి వాణి-కుమారస్వామి, ఇల్లంద మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, వర్ధన్నపేట ఫ్యాక్సన్ చైర్మన్ రాజేష్ ఖన్నా, కాంగ్రెస్ నాయకులు పోశాల వెంకన్న, ఈగ దామోదర్, బాబులాల్, రామకృష్ణ, యూత్ నాయకులు, కార్యకర్తలు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కట్టమైసమ్మ ఆలయ అభివృద్ధికి పాటుపడతా: ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



