నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని నాగపూర్ ఊర చెరువు వద్ద కొనసాగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాస్టర్ రోల్ పరిశీలించి కూలీల హాజరు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని ఈజీఎస్ సిబ్బందిని ఆదేశించారు. వేసవి ఎండలు అధికంగా ఉన్నందున ఉపాధి హామీ పథకం కూలీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఎండలో పనిచేసే సమయంలో తరచూ నీరు తాగడం,తలపై గుడ్డ లేదా టోపీ ధరించడం,మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం, అవసరమైనప్పుడు ఓఆర్‌ఎస్ ద్రావణం తీసుకోవడం ద్వారా నీరసం, అలసట వంటి సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు.ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొన్న కూలీలకు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సోమవారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రాజేశ్వర్, మేట్లు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



