నవతెలంగాణ – అశ్వారావుపేట
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు బీఆర్ఎస్ సోషల్ మీడియా అశ్వారావుపేట యాక్టివిస్ట్ మోటూరు మోహన్ తో పాటు అశ్వారావుపేట బీఆర్ఎస్ నాయకులు ఆదివారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోటూరి మోహన్ నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ మహోత్సవానికి ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 14 న నిర్వహించనున్న గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో కాసాని నాగ శేష పద్మ చంద్రమోహన్, డాక్టర్ బి. ప్రసాదరావు, సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి జుజ్జురపు శ్రీరామమూర్తి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇటీవల మున్సిపాలిటీ చైర్మన్ పదవికి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన కాసాని పద్మ చంద్రమోహన్‌తో కేటీఆర్ స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం పై చర్చించినట్లు నాయకులు తెలిపారు.
కేటీఆర్ కు మోటూరి గృహప్రవేశ ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



