నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్‌పై టీవీకే అధినేత విజయ్ సీఎం ప్రమాణస్వీకారం ఎఫెక్ట్ పడింది. ఇవాళ మధ్యాహ్నాం తమిళనాడు చెన్నైలోని చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో వారియర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. స్డేడియంలో సీట్లు ఖాళీగా దర్శమిచ్చాయి. చెన్నై వేదికగా సీఎస్కే మ్యాచ్ అంటే చెపాక్ మైదానం నిండు కుండను తలపించేంది. అభిమానుల కేరింతలతో స్టేడియంతో సందడిగా ఉండేది. ఎల్లో టీషర్ట్‌లతో మైదామంతా పసుపుమయంగా మారేంది. తమ అభిమాన ఆటగాళ్ల పేర్లను పిలుస్తూ టీంకే ఉత్సహాన్ని ఇచ్చేవారు. కానీ తాజాగా ఆ పరిస్థితులు కన్పించడం లేదు. అనేక మంది క్రికెట్ అభిమానులు టీవీకే అధినేత విజయ్ సీఎం ప్రమాణస్వీకారం తరలివెళ్లారు. దీంతో మైదానంలో సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి.
చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదికగా విజయ్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. విజయ్‌తో గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. విజయ్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఎన్. ఆనంద్, ఆదవ అర్జున, కె.ఎ. సెంగోటియన్, ఎస్ కీర్తన, కె.జి. అరుణ్ రాజ్, పి. వెంకటరమణన్, సి.ఆర్. నిర్మల్ కుమార్, రాజ్‌మోహన్, టి.కె. ప్రభు ఉన్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు.



