- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలో జనగణన సర్వేలు గ్రామ గ్రామాన సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సర్వేలో ఉపాధ్యాయులు, జిపి కార్యదర్శి ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టారు. కార్యక్రమ ప్రారంభంలో మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో చేపట్టిన సర్వేలో సర్పంచ్ మాధవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వే పూర్తికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. అధికారుల వెంట గ్రామ కార్యదర్శి, సర్వే అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



